సమాజానికి స్నేహ హస్తం పుస్తకావిష్కరణ

by Disha Web Desk 18 |
సమాజానికి స్నేహ హస్తం పుస్తకావిష్కరణ
X

దిశ, అంబర్ పేట్: ప్రముఖ రచయిత మధు వాకిటి రచించిన 'సమాజానికి స్నేహ హస్తం' పుస్తక ఆవిష్కరణ సభ పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలోని సమావేశం మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణాచారి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంబంధాలు అంటే మానవ సంబంధాలేనని తెలిపారు. ప్రజా సంబంధాలు లేకపోతే పనులు జరగవన్నారు. ప్రజా సంబంధాల శాఖలో పనిచేస్తే మధు తన అనుభవాలను ఎంతో అద్భుతంగా రచించారని కొనియాడారు.

ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. సమాజంలో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా డిజిటల్ మీడియాకు ఆదరణ పెరిగిందన్నారు. మధు రచించిన సమాజానికి స్నేహ హస్తం పుస్తకం ఆలోచనకు ప్రేరణ కలుగుతుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు రచించారని ఆకాంక్షించారు. పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి సభా అధ్యక్షత వహించిన కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ చెన్నయ్య, సంస్థ ప్రధాన కార్యదర్శి బాబ్జీ, కార్యదర్శి మోహన్ రావు పాల్గొన్నారు.

Next Story