అన్ని దానాలలో కెల్లా రక్తదానం మిన్న: హోం మంత్రి మహమూద్ అలీ

by Dishanational1 |
అన్ని దానాలలో కెల్లా రక్తదానం మిన్న: హోం మంత్రి మహమూద్ అలీ
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: అన్ని దానాలలోకెల్లా రక్తదానం మిన్న అని రాష్ట్ర హోంశాఖా మంత్రి మహమూద్ అలీ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని గురువారం నాంపల్లిలోని గృహ కల్ప ఆవరణలో టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుసేనీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిభిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 700 మంది ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడేందుకు రక్తం అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, ఇతర అనుకోని సంఘటనలలో ప్రమాదాల బారిన పడినవారిని కాపాడేందుకు ఇలా రక్తదానం చేయడం ఉపయోగపడుతుందన్నారు.


ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సీఎం పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిభిరం నిర్వహించిన ముజీబ్ హుసేనీని అభినందించారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ఇతర ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుసేనీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి బర్త్ డే ను పురస్కరించుకుని తాను ఇచ్చిన పిలుపుతో ఉద్యోగులు వందల సంఖ్యలో కుటుంబ సభ్యులతో కలిసి హాజరై రక్తదానం చేయడం పట్ల సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజులలో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి ఆర్ ప్రతాప్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ ఎమ్ సుభాషిని, హైదరాబాద్ జిల్లా డీఐజీ ట్వింకిల్ జాన్, ది న్యూస్ ఎడిటర్ చీఫ్ మొహమ్మద్ నిజాముద్దీన్, డిస్టిక్ రిజిస్టర్ సౌత్ వల్లి సుబ్బలక్ష్మి, జిల్లా కార్యదర్శి విక్రమ్ కుమార్, పీపుల్ హెల్పింగ్ చిల్ద్రెన్ ఆర్గనైజేషన్, డిగ్రీ కాలేజ్ ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులతోపాటు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story