- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'మాట నిలబెట్టుకోలేదు.. ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలి'

దిశ, ఎల్బీనగర్: ప్రతిపక్ష పార్టీలో గెలిచి, అధికార పార్టీలోకి చేరే ముందు కీలకమైన సమస్యలైనటు వంటి రిజిస్ట్రేషన్, ముంపు, హౌస్ టాక్స్‌లు, డంపింగ్ యార్డ్ మొదలైన సమస్యల పరిష్కరించేందుకు పార్టీ మారుతున్నట్లు చెప్పి మాట తప్పిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి డిమాండ్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో స్థానిక కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి, నరసింహ గుప్తలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరించాలేకపోతే రాజీనామా చేస్తానని కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేశారని గుర్తు చేశారు. ముక్యంగా రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం కోసం జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో మంత్రి కేటీఆర్, రెవెన్యూ శాఖ మంత్రి మహమ్మద్ అలీ ఆరోగ్యం బాగోలేదని రాలేకపోయారని నాటకాలు ఆడారన్నారు. స్వయంగా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ తో కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఆరు నెలలో సమస్య పరిష్కరిస్తాని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు.
తర్వాత ఆయన కేబినెట్ మంత్రులతో కలిసి సబ్ కమిటీ వేసి రేపో మాపో జీవో వస్తుంది అంటూ మాయమాటలు చెప్పారని దుయ్యబట్టారు. ఆరు నెలలు గడిచినా.. ఎటువంటి జీ.ఓ రాకపోవడంతో కాలనీ వాసులు ఆందోళనకు దిగడంతో మరొకసారి కాలనీ అసోసియేషన్ సభ్యులతో కేటీఆర్ తో వీడియో కాన్ఫిరెన్స్ పెట్టి త్వరలోనే పరిష్కరిస్తామన్నారని గుర్తు చేశారు. అయినా ఇప్పటివరకు దాని ఊసే లేదని, ఇది జరిగి కూడా ఆరు నెలలు గడిచాయన్నారు.