- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కూట్లె రాయి తీయనోడు ఏట్లె రాయి తీస్తాడంట: రాజేశ్వరి

దిశ, అంబర్ పేట్: బీజేపీ తెలంగాణ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ పై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు అర్ధరహితమని బీజేపీ ఓబీసీ మోర్చా ఎంబీసీ సెల్ రాష్ట్ర కో-కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి విమర్శించారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లకు సాధారణ అసెంబ్లీ ఎన్నికలు ఐదేళ్ల తర్వాత మళ్లీ జరిగే అవకాశం ఉన్నందున వాటితోపాటు మునుగోడు నియోజకవర్గానికి కూడా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని చేబితే, ఆ వ్యాఖ్యలను వక్రీకరించి ఎలక్షన్ కమిషన్ కంటే ముందే బీజేపీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తున్నారని బీజేపీ చెప్పు చేతల్లో ఈసీ, సీబీఐ, ఎన్ఐఏ లాంటి సంస్థలు పనిచేస్తున్నాయని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఏదైనా కారణం వల్ల ఎన్నికైన ప్రజాప్రతినిధులు రాజీనామా చేసినా, చనిపోయినా తిరిగి ఆరు నెలలలోపు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల నియమావళిలో ఉందని తెలిపారు. దేశంలో ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు ఉపఎన్నికలు జరగాలన్న దేశంలోని ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంటే ఆ రాష్ట్రాల ఎన్నికలతో పాటే దేశవ్యాప్తంగా జరిగే ఉపఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని అనే విషయం తెలియకుండా దేశ రాజకీయాలు నడుపుతాననడం కూట్లె రాయి తీయలేనోడు ఏట్లె రాయి తీస్తాడంట అన్న చందంగా ఉందని ఎద్దేవాచేశారు.
మంత్రులు హరీశ్ రావు, జగదీశ్వర్ రెడ్డి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టారని, కేసీఆర్ దేశ రాజాకీయాల్లోకి వెళ్తున్నాడనే భయంతో మునుగోడు ఉపఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వేణి హిమ పాల్గొన్నారు.