- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఖాతాదారులకు అలర్ట్.. వరుసగా మూడు రోజులు బ్యాంకులు బంద్
by Vinod kumar |

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : బ్యాంకులకు వరుస సెలవుల కారణంగా మూడు రోజుల పాటు నగరంలో బ్యాంకులు మూతపడనున్నాయి. 13వ తేదీ రెండో శనివారం, 14వ తేదీ ఆదివారం, 15వ తేదీ దేశ స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో మూడు రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. తిరిగి ఈ నెల 16వ తేదీన బ్యాంకులు తెరుచుకోనున్నాయి. ప్రస్తుతం చాలా మంది ఖాతాదారులు బ్యాంకింగ్ లావాదేవీలు మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారానే నిర్వహిస్తుండగా వరుస సెలవుల కారణంగా నగదు డ్రా చేసుకోవాలనుకునే వారు ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. నగదు, చెక్ డిపాజిట్లు కూడా నిలిచిపోనున్నాయి. ఏటీఎంలు పనిచేస్తున్నప్పటికీ మూడు రోజుల పాటు వాటిలో నగదు నిల్వలు ఉంటాయో, లేదోనని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.
Next Story