- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణమహోత్సవం

దిశ ఖైరతాబాద్ : కన్నుల పండుగగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన లక్షలాది భక్తులతో ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది. శివసత్తులు, పోతురాజుల ఆటలతో కన్నుల పండుగ వాతావరణం నెలకొంది. మంగళ వాయిద్యాలు, మంత్రోచ్ఛరణల మధ్య మంగళవారం అమ్మవారి కళ్యాణం అంగ రంగ వైభవంగా జరిగింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ మహోత్సవానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ దంపతులు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అడుగడుగున అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో అన్నపూర్ణ, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సికింద్రాబాద్ టీఆర్ఎస్ పార్లమెంటరీ అభ్యర్థి తలసాని సాయికిరణ్, సనత్ నగర్ కార్పొరేటర్ లక్ష్మీ బాల్ రెడ్డి,అ మీర్ పెట్ కార్పొరేటర్ సరళ, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.