టీఎస్ ఐఐసీ చైర్మన్‌గా మళ్లీ బాలమల్లే నియామకం... ఇది ఎన్నోసారంటే...?

by S Gopi |
టీఎస్ ఐఐసీ చైర్మన్‌గా మళ్లీ బాలమల్లే నియామకం... ఇది ఎన్నోసారంటే...?
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ ఐఐసీ చైర్మన్ గా గ్యాదరి బాలమల్లు నియామకం అయ్యారు. ఇప్పటికే రెండుపర్యాయాలు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం ముగియడంతో మరోసారి నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన మూడేళ్లు కొనసాగనున్నారు. 2016 నుంచి 2019 వరకు, 2019 నుంచి 2022 వరకు రెండు పర్యాయాలు చైర్మన్ గా పనిచేశారు. పొడగింపుతో 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు చైర్మన్ గా కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థను మరింత అభివృద్ధి పథకంలోకి తీసుకొస్తామన్నారు. త్వరలోనే మరిన్ని పారిశ్రామిక పార్కులను అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు వెల్లడించారు.

Next Story

Most Viewed