Value Zone Hyper Mart: పటాన్ చెరులో 'వాల్యూ జోన్ హైపర్ మార్ట్‌'ను ప్రారంభించిన హీరో బాలకృష్ణ..

by Disha Web Desk 13 |
Value Zone Hyper Mart: పటాన్ చెరులో వాల్యూ జోన్ హైపర్ మార్ట్‌ను ప్రారంభించిన హీరో బాలకృష్ణ..
X

దిశ, వెబ్‌డెస్క్: మహానగరం హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు తమ ఔట్‌లెట్లను ప్రారంభించాయి. తాజాగా ప్రముఖ రిటైల్‌ సంస్థ వాల్యూ జోన్‌ హైదరాబాద్‌లో హైపర్‌మార్ట్‌ను ప్రారంభించింది. పటాన్‌చెరు వద్ద ఏర్పాటు చేసిన ఈ హైపర్‌ మార్ట్‌ను ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ తమ చేతుల మీదుగా గ్రాండ్‌గా ప్రారంభమైంది. నగరవాసులకు సరికొత్త షాపింగ్‌ అనుభవం కల్పించాలని ఉద్దేశంతో ఈ హైపర్‌మార్ట్‌ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో 'వాల్యూ జోన్' విశ్వనగరమైన హైదరాబాద్‌లో మొట్టమొదటి అతి పెద్ద బెట్లెట్ మాల్గా చరిత్రను సృష్టించబోతోంది.

వర్తక, వాణిజ్యాలలో సుదూర దృష్టి కలిగిన శ్రీ పి. వెంకటేశ్వర్లు, శ్రీ ఎస్. రాజమౌళి, శ్రీ టి. ప్రసాదరావు, దివంగత పి. సత్య నారాయణ గార్ల క్రియాశీలక సారథ్యంలో 'వాల్యూ జోన్ హైపర్ మార్ట్' రూపుదిద్దుకుని, నేడు శుభారంభం చేసుకుంటోంది. ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ప్రఖ్యాత నటులు శ్రీ నందమూరి బాలకృష్ణగారు తమ హస్తాల మీదుగా, వినూత్నమైన ఉత్సాహంతో, వెల్లువెత్తిన వేడుకల మధ్య హైదరాబాద్‌లోనే మొట్టమొదటి అతి పెద్ద ఔట్ లెట్ మాల్ అయిన 'వాల్యూ జోన్ హైపర్ మార్ట్'కు నేడు శుభారంభం చేశారు. అంతేకాదు ఈ సంస్థ ప్రాముఖ్యాన్ని మన బాలయ్య గారు- టీవీ, థియేటర్, టెట్డోర్, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫారం వంటి బహుళ మాధ్యమాల ద్వారా వినియోగదారులకు వివరిస్తున్నారు.

'వాల్యూ జోన్ హైపర్ మార్ట్' గ్లోబల్ బ్రాండ్స్‌తో పాటు ఇండియన్ ఫ్యాషన్ బ్రాండ్స్ మొదలుకుని గ్రాసరీస్, ఫుట్వేర్, లగేజ్, ఫర్నిషింగ్స్, స్టేషనరీ, మొబైల్ యాక్ససరీస్, ఇంకా మరెన్నో 2 లక్షలకు పైగా వైవిధ్యభరిత ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ఏడాది పొడుగునా ఇవి 70% ఆఫ్- డీల్స్కి ఇవి వినియోగదారులకు లభించడం మరో విశేషం. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే- విశ్వనగరంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న శివారు ప్రాంతమైన 'పటాన్చెరు'లో ఈ 'వాల్యూ జోన్ హైపర్ మార్ట్' నెలకొని ఉండటం! బెటర్ రింగ్ రోడ్డుకు, జాతీయ రహదారికి ఇది అతి సమీపంలోను, అమీర్‌పేట్‌కి, ఐటీ కారిడార్కు కేవలం 20 ని॥ల దూరంలోనూ అతి పెద్ద ఔట్లెట్ మాల్ అయిన 'వాల్యూ జోన్ హైపర్ మార్ట్' వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇక్కడికి విచ్చేసే ప్రతీ కుటుంబం షాపింగ్‌ను కొన్ని గంటలపాటు వినోదాత్మక అనుభూతిగా ఆనందించేందుకు వీలైన ఏర్పాట్లు 'వాల్యూ జోన్ హైపర్ మార్ట్' పెద్ద యెత్తున చేసింది.


సంస్థతో తమ అనుబంధం గురించి మాట్లాడిన శ్రీ నందమూరి బాలకృష్ణ.. "ఈ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ రీటైల్ వాణిజ్య వ్యవస్థలోనే ఒక వినూత్న విప్లవం మన హైదరాబాద్ నగరానికే గర్వకారణం. ఇందులో విస్తృత శ్రేణికి చెందిన నాణ్యమైన ఉత్పత్తుల్ని, లాభసాటి ధరలకు కొనుగోలు చేయటం గొప్ప షాపింగ్ అనుభవం. మీకు నచ్చిన, మీరు మెచ్చిన ప్రతీ వస్తువుకూ కేరాఫ్ అడ్రస్ - వాల్యూ జోన్ హైపర్ మార్ట్" అన్నారు. వాల్యూ జోన్ హైపర్ మార్ట్‌కి లభిస్తున్న విశేష స్పందన సంస్థ డైరక్టర్లలో అనూహ్యమైన ఉత్సాహాన్ని నింపింది. రీటైల్ ప్రపంచంలో ఔట్ లెట్ మాల్స్కి ప్రాముఖ్యం ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్‌లోనే మొట్టమొదటి అతిపెద్ద టెట్లెట్ మాల్ తమ 'వాల్యూ జోన్ హైపర్ మార్డ్' కావటం ఆనందదాయకమని, భవిష్యత్తులో ఇది గొప్ప బెంచ్ మార్క్ కాగలదని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

సురేశ్ సీర్ణ, డైరెక్టర్: "రీటైల్ వ్యవస్థ చరిత్రలో వాల్యూజోన్ సరికొత్త అధ్యాయం. వినూత్నమైన షాపింగ్ అనుభవాన్ని పొందగోరే వినియోగదారులకు ఇది ఆకర్షణీయ కేంద్రం." అని అన్నారు. సివిఎస్ అభినవ్, డైరెక్టర్ మాట్లాడుతూ.. "వినియోగదారుల వైవిధ్యభరితమైన అభిరుచులను, అవసరాలను దృష్టిలో ఉంచుకుని మా వాల్యూ జోన్ విస్తృత శ్రేణికి చెందిన సరిసాటిలేని ఉత్పత్తులను అన్ని వర్గాల, తరాల వినియోగదారులకూ అందుబాటులో ఉంచుతోంది." పేర్కొన్నారు. టి. రాకేశ్, డైరెక్టర్: "షాపింగ్ను ఓ అందమైన అనుభూతిగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ మేము వినియోగదారుల అవసరాలకు మొట్టమొదటి ప్రాధాన్యాన్ని ఇస్తున్నాము." అని తెలిపారు. అలాగే టి. కేశవ్ గుప్తా, డైరెక్టర్ మాట్లాడుతూ.. "సువిశాలమైన స్థలంలో సుందరంగా రూపొందించిన ఇంటీరియర్స్ మా వాల్యూ జోన్ తాలూకు ప్రత్యేక ఆకర్షణ! ఇక్కడ ప్రతీ వస్తువూ అందంగా, ఆకట్టుకునేలా కనిపిస్తుంది. ఈ అద్భుత ప్రదర్శన వల్ల ఇది షాపింగ్ స్వర్గంగా అందరినీ అలరిస్తోంది. విలాసానికి విలాసం, విలువకు విలువ, వినోదానికి వినోదం కొనుగోలును వేడుకలా చేసే అందమైన త్రివేణీ సంగమం" అని పేర్కొన్నారు.

షాపింగ్‌ అంటే కేవలం వస్తువులను కొనుగోలు చేయడం మాత్రమే కాదని. ఒక అనుభవంగా ఊహించుకునేందుకుగాను సరికొత్తగా డిజైన్‌ చేసినట్లు వెల్లడించింది. మాల్‌లో నిత్యవసర వస్తువులు, ఫుడ్, బట్టలు అందుబాటులో ఉంటాయని.. ఫ్యాషన్‌, ఫుడ్‌, ఫన్‌ ఉంటాయని కంపెనీ తమ ప్రకటనలో వెల్లడించింది. పురుషులు, మహిళలు, చిన్నపిల్లల కోసం వస్త్రాలు, ఫుట్‌వేర్‌తో పాటు ఇంట్లోకి కావాల్సిన అన్ని వస్తువులు లభిస్తాయని తెలిపింది. ఫుడ్‌కోర్టు కూడా ఉందని కంపెనీ తెలిపింది. కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి 40 శాతం రాయితీ ఇస్తున్నట్టు తెలిపింది. అదిరిపోయే ఆఫర్లను కొనుగోలుదారుల కోసం ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది.

Next Story

Most Viewed