కంటి గ్లాకోమా పై అవగాహన

by Disha Web Desk 15 |
కంటి గ్లాకోమా పై అవగాహన
X

దిశ, జూబ్లిహిల్స్ : కంటి దృష్టిపై స్టెరాయిడ్ ప్రేరిత గ్లాకోమా ప్రభావాన్ని వివరించేందుకు తలపెట్టిన గ్లాకోమా అవేర్‌నెస్ వాక్ ను ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వద్ద సినీ నటి నిహారిక కొణిదెల జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె‌ మాట్లాడుతూ... గ్లాకోమాపై ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వైద్యులు, వైద్య నిపుణులు చేస్తున్న కృషిని అభినందించారు.

కంటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ కన్సల్టెంట్ ఆప్తాల్మాలజిస్ట్ డాక్టర్ సిద్ధార్థ దీక్షిత్ మాట్లాడుతూ.. ఈనెల 10 నుంచి 16వ తేదీ వరకు ప్రపంచ గ్లాకోమా వీక్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్టెరాయిడ్ నిశ్శబ్దంగా కంటి దృష్టిపై ప్రభావం చూపుతుందన్నారు. గ్లాకోమా అనేది కంటి పీడనం పెరగడంతో కలిగే కంటి సమస్య అన్నారు. ఇది ఆప్టిక్ నరాలు దెబ్బతినడం ద్వారా అంధత్వానికి దారితీస్తుందన్నారు. దృష్టిని నష్టపోవడానికి అత్యంత సాధారణ కారణమన్నారు.

Next Story

Most Viewed