యువకుడిపై కత్తులతో దాడి

by Disha Web Desk 15 |
యువకుడిపై కత్తులతో దాడి
X

దిశ,కార్వాన్ : అర్ధరాత్రి యువకుడిపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేసిన ఘటన కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కుల్సుంపుర పోలీస్టేషన్ పరిధిలో అహ్మద్ అనే యువకుడి పై తప్పచబుత్ర ప్రాంతానికి చెందిన సోహెల్, అమీర్, సల్మాన్ అనే ముగ్గురు యువకులు కత్తితో దాడికి పాల్పడ్డారు.

మెహిదీపట్నం పిల్లర్ నంబర్ 100 వద్ద ఉన్న క్రౌన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న శుభకార్యానికి హాజరైన షేక్ అహ్మద్ పై ముగ్గురు ఒక్కసారిగా కత్తులతో దాడికి పాల్పడి విచక్షణా రహితంగా పొడవగా తీవ్ర రక్తశ్రావం అయింది. దాంతో అక్కడే కుప్పకూలడంతో స్థానికులు అహ్మద్ ను హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతానికి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. వీరందరికీ పాత గొడవలు ఉన్నాయని, అందుకే అహ్మద్ ను చంపడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed