- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వారిని కాపాడేందుకు బీజేపీ, అర్ఎస్ఎస్‌లు నియంతృత్వ ఉద్యమాన్ని చేస్తున్నాయి : అరుంధతి రాయ్

దిశ, ముషీరాబాద్: దేశంలోని కార్పొరేట్, పెట్టుబడిదారులను కాపాడేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు కుల, మతాల పేరుతో నియంతృత్వ ఉద్యమాన్ని చేస్తున్నాయని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ అన్నారు. మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాలగోపాల్ 13వ స్మారక సమావేశం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దేశంలో బిఎండబ్ల్యు కు, ఎడ్ల బండికి మధ్య పోటీ నడుస్తుందని, బిఎండబ్ల్యూ పోలేని చోటుకు ఎడ్ల బండి పోతుందని, అందుకోసం అందరూ మరింత కష్ట పడాలన్నారు.
ఫాసిస్ట్‌ను అందరికి నచ్చే విధంగా, అదే కరెక్ట్ అనే విధంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు కుట్రలు చేస్తున్నాయని అన్నారు. హిందూ, ముస్లింలల్లో ఉన్న మహిళలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో అవకాశవాదులు, నిజాయితీ లేని వారే సంఖ్యే ఎక్కువగా ఉందని, ఇటువంటి సమాజంలో బతకడానికే చిరాకు వస్తుందన్నారు. ఆధాని ప్రభుత్వంతో కలిసి పోయాడని, అందుకే ఎనిమిదేళ్లలో 8 బిలియన్ డాలర్ల నుండి 130 బిలియన్ డాలర్ల ఆస్తిని పెంచుకున్నాడని అన్నారు. త్వరలో అమిత్ షా కొడుకు కూడా ఆ లిస్టులో చేరబోతున్నారన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు రక రకాల ట్రైనింగ్ ఏజెన్సీల ద్వారా ఆర్మీలో తమ మనుషులనే రిక్రూట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాలుగేళ్ల తర్వాత ఆ ఆర్మీలో ఉన్న వారితో పార్టీ ఆర్మీని తయారు చేసే కుట్ర జరుగుతోందని అన్నారు.
కర్ణాటకకు చెందిన మానవతావాది, కార్మిక నేత క్లిఫ్టన్ డి' రోజారియో మాట్లాడుతూ.. మోదీ అనే వాడు మనిషి కాదు.. మోదీ అనే వాడు ఫాసిస్టు అనే భావజాలానికి ముఖం లాంటి వారన్నారు. దేశంలో కార్మికుల హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించారు. దేశంలో పేద వాళ్ళ కులం, మరొకటి పేద వాళ్ళను బయటకు తీసుకువచ్చే కులం వాళ్ళు ఉన్నారని మోదీ మూడేళ్ల క్రితం పార్లమెంట్ వద్ద ఓ సమావేశంలో అన్నారని క్లిఫ్టన్ డి' రోజారియో గుర్తు చేశారు. ఈ సమావేశంలో మిహిర్ దేశాయ్, జహా ఆరా తదితరులు హాజరై ప్రసంగించారు.