- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- IPL2023
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
అంతరాష్ట్ర సైబర్ నేరగాళ్ల అరెస్ట్

దిశ, మియాపూర్ : యాప్ లతో ప్రజలకు కుచ్చుటోపీ పెడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర సైబర్ నేరగాళ్లని సైబరాబాద్ సైబరా క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 3 ల్యాప్‌టాప్‌లు, బైక్, 15 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను ఏసీపీ నర్సింహారావు తో కలిసి మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి చందానగర్ పొలీస్ స్టేషన్ లో వెల్లడించారు. వేముల నాగ ప్రేమ్ ( 21), బానావత్ కుమార్ (20), జుపెయిర్(23) అలియాస్ రాహుల్ కలిసి మేటర్ మైండ్ కస్టమర్ కేర్ ఆపరేటర్‌ల పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఫోన్‌లలో వివిధ యాప్‌లు అంటే క్విక్ సపోర్ట్, ఏదైనా డెస్క్, సర్వర్ మంకీ, క్విక్ షేర్ తదితర యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలను మోసగించారు.
వీరంతా ఇప్పటి వరకు ఆయా పొలీస్ స్టేషన్ ల పరిధిలో సుమారు 41 సైబర్ నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ సైబర్ నేరాలు ఆయా పద్ధతుల్లో చేసినట్లు గుర్తించారు. కొల్లగొట్టిన డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలతో ల్యాప్‌టాప్‌లు, సెల్ ఫోన్‌లు మొదలైనవాటిని కొనుగోలు చేసేవారు. ఈ క్రమంలో చందానగర్ కు చెందిన సులోచానాదేవి అనే మహిళ గత నెల ఫిబ్రవరి 9 న చందానగర్‌లో కొత్త బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్‌ని కొనుగోలు చేయగా కే వై సీ డౌన్‌లోడ్ పేరుతో రూ.1,39,900 కొల్లగొట్టారు. దీంతో 23న ఆమె సైబర్ క్రైమ్ ఎన్ సీ ఆర్ పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన సీసీఎస్ పోలీసులు కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. వీరు ముగ్గురు కలిసి దేశవ్యాప్తంగా 1800 సైబర్ నేరాలు చేశారని, కేవలం తెలంగాణ లో 41 సైబర్ నేరాలు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.22 లక్షలు ఉన్నట్లు, ఇందులో సుమారు రూ.10 లక్షలను రికవరీ చేసినట్లు డీసీపీ వెల్లడించారు.