- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
లాల్ దర్వాజా ఆలయ నూతన కమిటీ నియామకం
దిశ, చార్మినార్ : లాల్ దర్వాజా చారిత్రాత్మక సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం 2023-2024 బోనాల ఉత్సవాలకు గాను ఆలయ కమిటీ నూతన చైర్మన్ గా మాజీ కార్పొరేటర్ చెన్న బోయిన రాజేందర్ యాదవ్ ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఆలయ కమిటీ సలహాదారులు కాశీ నాథ్ గౌడ్ అధ్యక్షతన ఆలయ ప్రాంగణంలో జరిగిన సర్వ సభ్య సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆలయ కమిటీ కన్వీనర్ గా గౌని అరవింద్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బి. మారుతీ యాదవ్, కోశాధికారిగా పోసాని సదానంద ముదిరాజ్ నియమితులైనారు. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన కమిటీని శాలువాతో ఘనంగా సత్కరించారు.
రెండు గ్రూప్ ల మధ్య సమిసిన గొడవలు
గత ఏడాది లాల్ దర్వాజా ఆలయ కమిటీ విషయంలో నేను చైర్మన్ అవుతానంటే నేను అవుతానని రెండు గ్రూప్ ల మధ్య గొడవలు జరిగాయి. రెండు గ్రూప్ ల మధ్య విభేదాలు తారాస్థాయి కి చేరుకోవడంతో సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో ఆలయ కమిటీ తో చర్చలు నిర్వహించి ఏండ్లు గా వస్తున్న సంప్రదాయాన్ని పక్కన బెట్టి అందరూ కలిసి బోనాలు విజయవంతం చేయాలని నిర్ణయించారు.
రెండు గ్రూప్ ల నుంచి ఇద్దరిద్దరిని కలిపి ఫోర్ మెన్ కమిటీ గా నియమించి అందరినీ శాంతింపజేశారు. కానీ ఫోర్ మెన్ కమిటీ విషయం అప్పట్లో ఎవ్వరికి మింగుడు పడని అంశం గా మారింది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఎట్టకేలకు ఉద్రిక్తత, ఘర్షణల నడుమ బోనాల ఉత్సవాలు ముగిశాయి. ఆదివారం జరిగిన లాల్ దర్వాజా ఆలయ కమిటీ సర్వసభ్యసమావేశం లో ఈ యేడు రెండు గ్రూప్ లు కాస్తా ఒక్కటయ్యాయి. తమ మధ్య విభేదాలు సమిసిపోయాయని, ఇక ఆలయ విస్తరణ, అభివృద్ధి మాత్రమే మాకు ముఖ్యమని ముక్త కంఠం తో నినదించారు.