- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బేగంపేటలో మరో వ్యక్తి దారుణ హత్య

దిశ బేగంపేట : కుటుంబసభ్యులను దూషించాడనే కోపంతో స్నేహితుడిని బండరాయితో కొట్టాడు దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బేగంపేట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బేగంపేట అన్నా నగర్ కు చెందిన మహ్మద్ యూసుఫ్ (29) నౌషాద్ (35) ఇద్దరు స్నేహితులు , మీరు ఫంక్షన్ హాళ్లలో పని చేస్తుంటారు. శుక్రవారం అర్ధరాత్రి బాలంరాయి కమాన్ వద్ద ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఇరువురు కుటుంబాల గురించి అసభ్యంగా మాట్లాడుకోవడంతో వాగ్వివాదం తారాస్థాయికి చేరి ఘర్షణకు దారితీసింది. దీంతో మహమ్మద్ యూసఫ్ పక్కనే ఉన్న బండరాయి తీసుకుని నౌషాద్ తలపై బలంగా కొట్టాడు. తలకు తీవ్ర గాయాలవడంతో నౌషాద్ అక్కడే కుప్పకూలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నౌషాద్ ను గాంధీ ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం సాయంత్రం నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు బేగంపేట ఏసీపీ సీఐ వెల్లడించారు.