- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( HCA) పై మరో కేసు

X
దిశ.బేగంపేట : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై మరో కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళితే .. క్రికెట్ మ్యాచ్ వీక్షించడం కోసం బేగంపేటకు చెందిన న్యాయవాది ఉప్పల అరుణకుమార్ జింఖానా మైదానంలో టికెట్ కొనుగోలు చేశారు. టికెట్ పై మ్యాచ్ సాయంత్రం 7:30 కు ప్రారంభం అవుతుందని ముద్రించారు . టికెట్ పై ముద్రించిన సమయానికి ఆయన స్టేడియానికి చేరుకున్నారు. అయితే 7 గంటలకే మ్యాచ్ ప్రారంభమయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. టికెట్ పై తప్పుగా సమయాన్ని పేర్కొనడంతో అర్ధగంట పాటు మ్యాచ్ చూసే అవకాశం కోల్పోయారన్నారు . టికెట్లపై తప్పు సమయం ముద్రించి మోసం చేసిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై చర్యలు తీసుకోవాలని బేగంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు హెచ్ సి ఏ పై కేసు బుధవారం నమోదు చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపారు.
Next Story