కిక్కిరిసిన కోఠి ఉమెన్స్ కళాశాల చౌరస్తా..

by Disha Web Desk 20 |
కిక్కిరిసిన కోఠి ఉమెన్స్ కళాశాల చౌరస్తా..
X

దిశ, కార్వాన్ : వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని వేల సంఖ్యలో ఏఎన్ఎంలు ధర్నా చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచే కోఠి ఉమెన్స్ కళాశాల చౌరస్తా వద్దకు చేరుకొని రోడ్డు పై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఒక్కసారిగా వేలాదిమంది చేరుకోవడంతో ఉమెన్స్ కళాశాల చౌరస్తా జనసమూహంగా మారిపోయింది. ఎక్కడికి అక్కడే బస్సులు, ద్విచక్ర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో చాదర్ఘాట్ నుంచి కోటి బ్యాంక్, దిల్ సుక్ నగర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్రఇబ్బందులకు గురయ్యారు.

ఒక్కసారిగా వేలాదిమంది చౌరస్తాలో బయటాయించడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. ఆశాలు, ఏఎన్ఎంలతో పాటు వైద్య శాఖలో పనిచేస్తున్న వివిధ క్యాడర్ల కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఉమెన్స్ కళాశాల చౌరస్తాలో ఆందోళనలో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీ బలగాలతో మోహరించి బందోబస్తు నిర్వహించారు. వారికి పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినక పోవడంతో చేసేది ఏమీ లేక పోలీసులు బందోబస్తుకే పరిమితమయ్యారు. ధర్నాకు ఆయా సంఘాల నాయకులు నరసింహ, భూపాల్, రామాంజనేయులు జయలక్ష్మి తదితరులు హాజరై ధర్నాను ఉద్దేశించి ప్రసంగించారు.

Next Story

Most Viewed