చార్మినార్‌ను సందర్శించిన అమెరికన్ కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్

by Mahesh |
చార్మినార్‌ను సందర్శించిన అమెరికన్ కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్
X

దిశ, చార్మినార్ : చారిత్రాత్మక చార్మినార్‌ను శనివారం అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా చార్మినార్ అందాలను వీక్షించారు. ఆమె గైడ్ ద్వారా చార్మినార్ చారిత్రక నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ మాట్లాడుతూ.. పాతబస్తీ చార్మినార్ అందాలను వీక్షించేందుకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా కొత్త అనుభూతి కలుగుతుందన్నారు. చార్మినార్‌ను వీక్షించడం అదృష్టంగా భావిస్తున్నన్నారు. చార్మినార్ ప్రపంచంలోనే అద్భుతమైన సుందర కట్టడం అని కొనియాడారు. హైదరాబాద్ వంటకాలు అంటే తనకు ఎంతో ఇష్టం అన్నారు.

Next Story

Most Viewed