వినాయక నిమజ్జనంపై ఏరియల్ సర్వే

by S Gopi |   ( Updated:2022-09-09 12:18:37.0  )
వినాయక నిమజ్జనంపై ఏరియల్ సర్వే
X

దిశ, బేగంపేట, సికింద్రాబాద్: నగరంలో వినాయక నిమజ్జనంపై శుక్రవారం నాలుగు గంటల సమయంలో బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి ఏరియల్ సర్వే నిర్వహించారు. హోం మంత్రి మహమ్మద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేక హెలికాప్టర్ లో బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి ట్యాంక్ బండ్ పై ఏరియల్ సర్వే నిర్వహించారు. దీంతోపాటు నగరంలోని బాలాపూర్, ఖైరతాబాద్, చార్మినార్ తదితర ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి వినాయక శోభాయాత్ర ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు, భద్రతా పర్యవేక్షణ వంటి అంశాలపై చర్చించారు.

Also Read: తృటిలో తప్పిన ప్రమాదం... లిఫ్ట్ చేసే సమయంలో కిందపడ్డ వినాయక విగ్రహం (వీడియో)



Next Story