స్త్రీ శిశు సంక్షేమ శాఖలో 14 మంది పై చర్యలు..

by Sumithra |
స్త్రీ శిశు సంక్షేమ శాఖలో 14 మంది పై చర్యలు..
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : జిల్లా స్త్రీ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది శుక్రవారం కార్యాలయ విధులకు హాజరై అనుమతి లేకుండా కార్యాలయం విడిచి వెళ్లిపోవడం పై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు 14 మంది పై సీసీఏ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకున్నారు. శుక్రవారం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో పనిచేసే రెగ్యులర్ సిబ్బంది మహమ్మద్ నుస్రత్ అలీ, సూపరింటెండెంట్, పర్వేజ్ వసీమ్, సీనియర్ అసిస్టెంట్, కే. కవిత జూనియర్ అసిస్టెంట్, జి. కవిత. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎం.అరవింద్ కుమార్, కార్యాలయ సబ్ ఆర్డినేట్, డిప్యూటేషన్ స్టాఫ్ జివి. సత్యనారాయణ రావు, సూపర్టెండెంట్, ఎస్ఏ శైలజ ఈవో గ్రేడ్ 1, మోఖిమ్ ఖురేషి సీనియర్ అసిస్టెంట్, వై సాయి కృప జూనియర్ అసిస్టెంట్, బి.భరత్ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ హబ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ స్టాఫ్ కే లక్ష్మీ తేజస్విని, డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ డి. దీపిక, జండర్ స్పెషలిస్ట్ 2, కే. కీర్తి అకౌంట్స్ అసిస్టెంట్, కే సరిత, డేటా ఎంట్రీ ఆపరేటర్ లు హాజరు రిజిస్టర్ లో సంతకాలు చేసి కార్యాలయం విడిచి వెళ్లారు. దీంతో కలెక్టర్ వారి ఒకరోజు వేతనం నిలుపుదలతో పాటు వారి సర్వీస్ ను కౌంట్ చేయవద్దని, ఎఫ్ఆర్ 18 ప్రకారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
Next Story