నిజాం కాలేజీలో విద్యార్థుల ఆందోళన

by Dishanational1 |
నిజాం కాలేజీలో విద్యార్థుల ఆందోళన
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఫీజుల రియంబర్స్ మెంట్ తోపాటు ఉపకారవేతనాలు వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఏబీవీపీ తెలంగాణ శాఖ ఆదేశాల మేరకు ఏబీవీపీ నిజాం కళాశాల యూనిట్ ఆధ్వర్యంలో నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ బ్లాక్ నుండి 2వ గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్న రూ. 3816 కోట్ల స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్ మెంట్ నిధుల విడుదల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి వీడాలన్నారు. ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ శ్రావణ్, సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ సురేష్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ సాయి కుమార్, కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ అజయ్, నరసింహ, పవన్ జాయింట్ సెక్రటరీ అన్వేష్, వినీత్, కళాశాల ఎగ్జిక్యూటివ్ మెంబెర్ పూజ, నితిన్, రాకేశ్, శ్రీకాంత్, విష్ణు, ధనరాజ్, సాగర్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed