'ఓయూ వీసీ తక్షణమే రాజీనామా చేయాలి'

by S Gopi |
ఓయూ వీసీ తక్షణమే రాజీనామా చేయాలి
X

దిశ, హిమాయత్ నగర్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిజాం కాలేజ్ ఆధ్వర్యంలో బుధవారం బషీర్ బాగ్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ దిష్టి బొమ్మను విద్యార్థులు దహనం చేశారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రెటరీ శ్రావణ్ మాట్లాడుతూ అసమర్ధపు వీసీని వెంటనే రాజీనామా చేయాలని, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులరైజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదే మాదిరిగా ఎలాంటి మెస్ డిపాజిట్లు లేకుండా పీజీ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని, అన్ని అటానమస్ కళాశాలో విద్యార్థులకు సరిపడా సొంత హాస్టల్ భవనాలు నిర్మించాలని, కళాశాలలో నిర్మించిన బాలికల హాస్టల్లో డిగ్రీ విద్యార్థినులకు వసతి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు సాయి కుమార్, ఉపాధ్యక్షులు అజయ్, పవన్, ప్రణయ్, అదనపు కార్యదర్శి చంద్రకాంత్, అంజి, వినీత్, నరసింహ, విష్ణు, ప్రవీణ్, సాయినాథ్, రాకేశ్, శ్రీకాంత్, శివప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed