బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి AAP యత్నం

by Disha Web Desk 12 |
బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి AAP యత్నం
X

దిశ, నల్లకుంట: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదానితో దోస్తీ దేశద్రోహం అని అమ్ ఆద్మీ పార్టీ కోర్ కమిటీ సభ్యుడు డాక్టర్ మండిపడ్డారు. ఇద్దరు దేశ ఆస్తులు అమ్ముతున్నారు. ఇద్దరు కొంటున్నారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి డిమాండ్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కమిటీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అన్ని బీజేపీ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలో భాగంగా పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ముందస్తుగా పోలీసులు బీజేపీ పార్టీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసన తెలుపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.

పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో బీజేపీ పార్టీ పరిసర ప్రాంతాలు కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. దేశంలో ఉన్న వనరులన్నీ అదానికి కట్టబెడుతున్నారని, విమానాశ్రయాలు, రైల్వేలు పోర్టులు, ఖనిజ వనరులు, ఆయిల్ కంపెనీలు ఆదానికి కట్టబెట్టారని దుయ్యబట్టారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 30 వేల కోట్ల పైగా అప్పులు తీసుకున్నారన్నారు.

ఎల్ఐసి డబ్బులు 30 వేల కోట్లు కూడా అదానికి అప్పజెప్పారని అదాని- మోడీ దోస్తీ దేశద్రోహమే తక్షణం పార్లమెంటు జాయింట్ యాక్షన్ కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముట్టడి కార్యక్రమం లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు రాములు గౌడ్ శోభన్ భూక్య, డాక్టర్ హరి చరణ్,జనార్దన్ రెడ్డి, అఫ్జల్, అప్స,మస్జిద్,మదన్ లాల్, మౌలానా, పప్పు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story