ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య

by Disha Web Desk 15 |
ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య
X

దిశ, శేరిలింగంపల్లి : ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోక పోవడంతో యువతి నేహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లి జర్నలిస్ట్ కాలనీలో నివాసం ఉండే నేహా ( 19) గచ్చిబౌలిలోని ఓ బేకరీలో సేల్స్ గర్ల్స్ గా పనిచేస్తుంది. అదే బేకరీలో పనిచేస్తున్న సల్మాన్ అనే యువకుడితో ప్రేమలో పడింది. వీరి ఇద్దరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో సోమవారం సల్మాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మనస్థాపానికి గురైన నేహా మంగళవారం ఉదయం తాను ఉంటున్న రూమ్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు చెల్లెలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story