- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్కూల్ బిల్డింగ్‌పై నుంచి పడి.. విద్యార్థి అనుమానాస్పద మృతి

దిశ, ఎల్బీనగర్: బాలికల రెసిడెన్షియల్ స్కూల్ భవనం పైనుంచి పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణవేణి క్యాంపస్ భవనంలో కొనసాగుతున్న ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో పంతం శ్రేష్టవి (15) 9వ తరగతి చదువుతుంది. కాగా గురువారం అనుమానాస్పద స్థితిలో భవనం పైనుంచి కింద పడి.. తీవ్ర గాయాల పాలైంది. దీంతో వెంటనే విద్యార్థినిని మలక్ పేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాలిక పరిస్థితి విషమంగా ఉందని.. మలక్ పేట్ యశోద ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు యశోద వైద్యులు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే స్కూల్ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం కారణంగానే వైద్యం అందక బాలిక మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలిక కనిపించడం లేదని ఉదయం 10 గంటలకు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారని, అయితే 11 గంటలకు తల్లిదండ్రులు స్కూల్‌కి వెళ్తే బాలిక ఉందని 12 గంటలకు ఐదంతస్తుల భవనం పైనుంచి పడిందని ప్రిన్సిపల్ చెబుతున్నారని వాపోయారు. శ్రేష్టవి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.