ప్రేమించిన యువతి మాట్లాడడం లేదని సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

by Disha Web Desk 15 |
ప్రేమించిన యువతి మాట్లాడడం లేదని సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
X

దిశ, మియాపూర్ : ప్రేమించిన యువతి మాట్లాడడం లేదని సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పొలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివపేట మండలం ఆరూరు గ్రామానికి చెందిన అఖిల్(28) గచ్చిబౌలి లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కాగా అఖిల్ చందానగర్ లోని షైన్ ఇన్ లాడ్జి లో గది అద్దెకు తీసుకున్నాడు. అక్కడే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం ఎంతకీ తలుపు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హోటల్ సిబ్బంది సాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపల చూడగా ఫ్యాన్ కు ఉరేసుకొని ఉన్నాడు. కాగా అఖిల్ తాను ప్రేమించిన యువతి తనతో మాట్లాడడం లేదని, తన ఫోన్ నెంబర్ బ్లాక్ లో పెట్టిందని సూసైడ్ నోటు రాసుకుని ఆత్మహత్య కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed