బ్రేకింగ్ న్యూస్.. కారులో రూ. 50లక్షలు తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డ వ్యక్తి

by Seetharam |   ( Updated:2022-10-07 09:04:11.0  )
బ్రేకింగ్ న్యూస్.. కారులో రూ. 50లక్షలు తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డ వ్యక్తి
X

దిశ, జూబ్లీ హిల్స్ : జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారులో రూ. 50 లక్షలు తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ & జూబ్లీహిల్స్ పోలీసుల విశ్వసనీయ సమాచారం మేరకు..

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంకటగిరి కాలనీలో సెంట్రో కారులో రూ. 50 లక్షలతో వెళుతున్న కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని కారుతో పాటు.. రూ. 50లక్షల రూపాయల నగదును సీజ్ చేసారు. కూకట్‌పల్లిలో ఉండే లక్ష్మణ్ అనే వ్యాపారి, జూబ్లీహిల్స్‌కు చెందిన సంతోష్ అనే వ్యక్తి నుండి కుమార్ అనే వ్యక్తికి రూ. 50 లక్షల రూపాయలు తీసుకురమ్మని పురమాయించాడు. కుమార్ రూ.50 లక్షల రూపాయలతో సేంట్రో కారులో వెళ్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. రూ. 50 లక్షల నగదు లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని.. వీటిపై దర్యాప్తు చేస్తున్నామని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి : దూకుడు పెంచిన ఈడీ.. ఆ పత్రికా కార్యాలయంలో సోదాలు

Next Story