- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మైనర్ బాలికను బెదిరించి లైంగిక దాడి
దిశ, జూబ్లిహిల్స్ : మైనర్ బాలికపై లైంగిక దాడి కి పాల్పడిన ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోరబండ పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం బోరబండ సైట్-III ప్రాంతంలో బాధిత బాలిక ( 9 ) , తన తల్లిదండ్రులు , సోదరితో కలిసి నివాసం ఉంటుంది. బాధిత బాలిక ఇంటి దగ్గరలో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా కి చెందిన జన్నా సాయి కుమార్ ( 23 ) బోరబండ సాయి బాబా నగర్ లో ఉంటూ.. కార్పెంటర్ వర్క్ చేస్తుంటాడు. ఎన్నికల నేపథ్యంలో బాధిత బాలిక తల్లిదండ్రులు బుధవారం
రాత్రి 8.30 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లటంతో బాలిక ఆడుకుంటుంది. దాంతో జన్నా సాయి కుమార్ మైనర్ బాలిక ను బెదిరించి లైంగిక దాడి కి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే మీ తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. బాలిక ఏడుస్తుండటం గమనించిన ఇరుగుపొరుగు వారు అడగగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు బోరబండ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించి ఫిర్యాదు చెయ్యగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సాయి ఆచూకీ కోసం గాలించగా శ్రీకాకుళం జిల్లా సిత్తాపూర్ లో గురువారం రాత్రి దొరికాడు. దాంతో అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. నిందితుడి పై పోక్సో కేసు నమోదు చేసినట్లు బోరబండ సీఐ విజయ్ తెలిపారు.