- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉప్పల్ చౌరస్తాలో ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన..
by Vinod kumar |

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో మంగళవారం ఉప్పల్ చౌరస్తాలో సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. ట్రాఫిక్ డీసీపీ డి. శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 5 వేల మంది వరకు పాల్గొన్నారు. జాతీయ గీతం ఆలపించే సందర్భంగా రోడ్డుపై ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రశాంతంగా ముగిసేందుకు పోలీసులు చర్యలు తీసుకోవడంతో వారిని వాహనదారులు అభినందించారు. కాగా, సామూహిక జాతీయ గీతాలాపన లో పాల్గొన్న వారికి సన్ రైస్ ఫుడ్ మేనేజ్ మెంట్ యాజమాన్యం సాగర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, సాత్విక్ రెడ్డి లు సుమారు రూ 50 వేలు వెచ్చించి పండ్లు, ఇతర ఆహార పదార్థాలు అందించడంతో వారిని అక్కడున్న వారు ప్రశంసించారు.
Next Story