ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్

by Disha Web Desk 15 |
ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్
X

దిశ,కార్వాన్ : బైక్ లను దొంగలించిన ముగ్గురు దొంగల ముఠాను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించిన ఘటన శనివారం అప్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గత నెల ముఖేష్ తివారి (37)అనే వ్యక్తి ఉస్మాన్ ఘంజ్ నివాసి కాగా గత నెల తన ద్విచక్ర వాహనాన్ని తన ఇంటి వద్ద పార్క్ చేసి ఉదయం చూసేసరికి బైక్ కనిపించకుండా

పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అప్జల్గంజ్ పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా పలుచోట్ల తనిఖీలు చేసి ఇమ్రాన్(20), అల్లం సురేష్ (40), షేక్ షాబాజ్ (24) అనే ముగ్గురు దొంగలను పోలీసులు పట్టుకొని వారి నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మీరి పై గతంలో పలు పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని ముగ్గురు నిందితులను రిమాండ్ కు తరలించారు.


Next Story

Most Viewed