- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
చిన్ననాటి స్నేహితుడే ఒంటరి మహిళను దారుణంగా హత్యచేశాడు
దిశ, శేరిలింగంపల్లి: దీప్తి శ్రీనగర్ సీబీఆర్ ఎస్టేట్‌లో సోమవారం జరిగిన మహిళ దారుణ హత్య కేసును 24 గంటల్లో ఛేదించారు మియాపూర్ పోలీసులు. కాపురంలో చోటుచేసుకున్న గొడవల కారణంగా భర్తతో విడిపోయిన బండి స్పందన (29) దీప్తి శ్రీనగర్ సీబీఆర్ ఎస్టేట్స్ లో తన అమ్మ, తమ్ముడితో కలిసి ఉంటుంది. అయితే సోమవారం ఉదయం స్పందన దారుణ హత్యకు గురైంది. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న మియాపూర్ సీఐ దుర్గ రామలింగ ప్రసాద్, ఎస్సై కోన వెంకట్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలు, హత్య జరిగిన చోట దొరికిన ఆధారాలను బట్టి మృతురాలు స్పందన చిన్ననాటి క్లాస్ మేట్ మనోజ్ కుమార్ ఈ హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు.
అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆమెను చంపింది తానేనని అంగీకరించాడు. ప్రస్తుతం నిందితుడు మనోజ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మృతురాలి తో సన్నిహితంగా ఉండే మనోజ్ భర్తతో విడిపోవడంతో ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెపై పగ పెంచుకున్న మనోజ్ సోమవారం ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో మృతురాలు ఇంటికి వచ్చి మొదట విచక్షణ రహితంగా దాడి చేశాడు. అనంతరం స్క్రూడ్రైవర్ తో విచక్షణ రహితంగా పొడిచి హత్య చేశాడు. సీసీటీవీ కెమెరాలతో పాటు ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు.