ఎండవేడికి నడిరోడ్డుపై తగలబడిన బైక్!

by Aamani |
ఎండవేడికి నడిరోడ్డుపై తగలబడిన బైక్!
X

దిశ,శేరిలింగంపల్లి : ఎండలు మండిపోతున్నాయి. అప్పుడే 40 డిగ్రీలకు పైగా ఎండ తీవ్రత నమోదు అవుతుంది. అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ఎండల వేడికి వాహనాలు భగ్గుమంటున్నాయి. మంగళవారం మధ్యాహ్నం ఎండవేడికి బైక్ కాలిపోయిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధి ఇంద్రనగర్ లో చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు, గచ్చిబౌలి నుంచి త్రిబుల్ ఐటీ మార్గంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బైకు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బైకులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బైకు పక్కన ఆపిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి తెలిపాడు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ హాని జరగలేదు. ఎండవేడికి బైక్ లో నుండి మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది.

Next Story

Most Viewed