వారసుల చదువుకై.. 1872లో 'మదర్సా ఏ ఆలియా' నిర్మాణం

by Javid Pasha |   ( Updated:2022-09-17 04:47:28.0  )
వారసుల చదువుకై.. 1872లో మదర్సా ఏ ఆలియా నిర్మాణం
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఆలియా పాఠశాలను క్రీ.శ. 1872లో 5వ నిజాం నిర్మించారు. నిజాం సంస్థానంలోని ఉద్యోగులు, నిజాం వారసులు చదువుకోవడానికి 'మదర్సా ఏ ఆలియా' అనే పేరుతో దీన్ని నెలకొల్పారు. 'మదర్సా' అంటే పాఠశాల, 'ఆలియా' అంటే అన్నింటి కంటే గొప్పది అని అర్థం. నాటి నుంచి విద్యా సేవలందించిన ఈ పాఠశాల 1887లో నిజాం కళాశాల పేరుతో డిగ్రీ కాలేజీగా ఏర్పడింది. కళాశాల భవన నిర్మాణం ఇండో అరబిక్ శైలిలో ఉండగా.. ఇందుకు అవసరమైన సామాగ్రిని సైతం అరబ్ దేశాల నుంచి తెప్పించారు. కళాశాల పైకప్పు నిర్మాణంలో రైల్వేలైన్లలో బ్రిడ్జీలను నిర్మించే సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడారు. హైదరాబాద్ స్టేట్‌గా ఉన్నప్పుడు 1950లో జవహర్‌లాల్ నెహ్రూ ఆలియా కళాశాలను సందర్శించి పిల్లలతో గడిపినట్టు రికార్డులు చెబుతున్నాయి.

Also Read: రాష్ట్రపతి నిలయం.. నాటి బ్రిటీష్ రెసిడెన్షీ హౌస్‌గా రాజ్‌ మహల్

Also Read: హైదరాబాద్ హైకోర్టు.. నాలుగేళ్లు సాగిన నిర్మాణం..

Next Story