జీఎస్టీ అధికారుల‌పై కేసు నమోదు.. స‌ర్చ్ ఆప‌రేష‌న్ పేరుతో మ‌హిళ‌ను..

by Javid Pasha |
జీఎస్టీ అధికారుల‌పై కేసు నమోదు.. స‌ర్చ్ ఆప‌రేష‌న్ పేరుతో మ‌హిళ‌ను..
X

దిశ ఖైరతాబాద్: ఐదుగురు జీఎస్టీ అధికారులపై పోలీసులు కేసు న‌మోదు చేసిన సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 2019 సంవ‌త్స‌రంలో వ్యాపార‌వేత్త స‌త్య శ్రీధ‌ర్ రెడ్డి కంపెనీకి సంబంధించిన ప‌న్నుల చెల్లింపుల విష‌యంలో జీఎస్టీ అధికారులు సోధాలు నిర్వ‌హించారు. సెర్చ్ ఆప‌రేష‌న్ పేరుతో వ్యాపార‌వేత్త శ్రీధ‌ర్ రెడ్డి భార్య రాఘ‌విరెడ్డిని అక్ర‌మంగా నిర్బంధించి సోదాలు చేశారు. 2019 ఫిబ్రవరి 27న తనని నిర్భందించిన అధికారుల పై నేషనల్ మహిళ కమిషన్ కి రాఘ‌విరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలో నేషనల్ మహిళా కమిషన్ నుండి హైదరాబాద్ పోలీసులకు సిఫార్స్ రావ‌డంతో బాధితురాలి వద్ద నుండి వివరాలు సేకరించిన‌ పోలీసులు ఐదుగురు అధికారులు బోలినేని గాంధీ, చిలుక సుధారాణి, ఇసాబెల్లా,ఆనంద్ కుమార్, కుచ్ ల పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.

Next Story