బాధితురాలికి 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలి : Y. S. Sharmila

by Sridhar Babu |
బాధితురాలికి 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలి : Y. S. Sharmila
X

దిశ, వనస్థలిపురం : ఎల్బీనగర్లో గిరిజన మహిళపై పోలీసులు చేసిన దాడి యావత్ ప్రజానికానికే సిగ్గుచేటని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన మహిళపై ఎల్బీనగర్ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన నేపధ్యంలో తీవ్ర గాయాలపాలై బీఎన్ రెడ్డి నగర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వడ్త్య లక్ష్మిని ఆదివారం షర్మిల పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన మహిళలపై ఎల్బీనగర్ ఎస్​ఐ రవికుమార్, కానిస్టేబుల్ చేసిన దాడి తప్పు అన్నారు. కూతురు కోసం తన అన్న వద్ద మూడు లక్షల రూపాయలు, లగ్న పత్రికలు తీసుకుని ఆటో కోసం వేచి చూస్తున్న అమాయక మహిళను దారుణంగా హింసించడం సహించరానిదన్నారు.

తాగిన మైకంలో ఉన్న ఎస్​ఐ రవికుమార్, కానిస్టేబుల్ రాత్రి పోలీస్ కారులో దాదాపు మూడు గంటలు ఎక్కడెక్కడో తిప్పి ఆమె వద్ద ఉన్న నగదు, నగలను కాజేసి పోలీస్ స్టేషన్​కు తరలించారని తెలిపారు. స్టేషన్లో ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ ఉన్నా వారు స్పందించలేదన్నారు. తప్పుచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలే కానీ కొట్టాలని ఐపీసీలో ఎక్కడా లేదన్నారు. ఈ దారుణానికి పాల్పడిన పోలీసులపై ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. బాధితురాలిని పరామర్శించిన సమయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వం తరుపును 120 గజాల భూమిని ఇస్తామని చెప్పడం కాదని, బహిరంగ ప్రకటన చేయాలని, పోలీసుల తరుపున బాధితురాలికి 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలనినీ డిమాండ్ చేశారు. ఇందుకు గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్,

హోంమంత్రి మహ్మద్ అలీ బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బాధితురాలికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ముందు రాస్తారోకో చేశారు. అధికారులు రాకపోవడంతో అక్కడ నుంచి పాదయాత్రగా వెళ్లి నాగార్జున సాగర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు రాస్తారోకో చేస్తున్న రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

సమాచారం అందుకున్న పోలీసులు రాస్తారోకో చేస్తున్న షర్మిలను పోలీస్ స్టేషన్​కు తరలించే సమయంలో పోలీసులతో ఆమెకి కొద్దిసేపు వాగ్వాదం అయింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వెంటనే పోలీసులు షర్మిలతో పాటు పార్టీ నాయకులను, గిరిజన సంఘాల నాయకులను అక్కడ నుంచి పోలీస్ కారులో పోలీస్ స్టేషన్​కు తరలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, గిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed