- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గణేష్ నిమజ్జన శోభయాత్రలో అపశృతి.. లారీ కింద పడి డిగ్రీ విద్యార్ధి మృతి

దిశ, చార్మినార్ : గణేష్ నిమజ్జన శోభయాత్రలో అపశృతి దొర్లింది.. పాతబస్తీకి చెందిన డిగ్రీ విద్యార్థి అబిడ్స్ చర్మాస్ వద్ద గణేష్ విగ్రహాన్ని నిమజ్జనానికి తరలిస్తున్న లారీ వెనుక చక్రాల కింద పడి మృతి చెందిన ఘటన అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో పాతబస్తీ అలియాబాద్ శారద విద్యాలయం ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీకి చెందిన రవికుమార్, అరుణలు భార్య భర్తలు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు సంతానం.
కుమారుడు జైసాయి(20) డిగ్రీ చదువుతున్నాడు. స్థానికంగా ప్రతి ఏటా స్నేహితులతో కలిసి వినాయక విగ్రహం ప్రతిష్టిస్తారు. ఎప్పటి లాగానే ఈ ఏడు కూడా వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు. లడ్డు వేలం పాట కూడా జైసాయి ఎంతో హుషారుగా నిర్వహించాడు. శుక్రవారం గణేష్ నిమజ్జనం సందర్భంగా హుస్సేన్ సాగర్ వెళ్ళడానికి Tn 34u1181 నెంబర్ గల లారీని బుక్ చేసుకున్నారు. శుక్రవారం స్థానికంగా ఉన్న మూడు వినాయక విగ్రహాలను అదే లారీలో ఎక్కించారు.
జైసాయి తన స్నేహితులతో కలిసి ఎంతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ముందుకు కదిలారు. శనివారం తెల్లవారుజామున 1.30 ప్రాంతంలో లారీ అబిడ్స్ చర్మాస్ వద్దకు చేరుకుంది. అప్పటి వరకు ఎంతో హుషారుగా ఉన్న జైసాయి అదే లారీ వెనుక చక్రాల కింద పడి, తీవ్ర గాయలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న అబిడ్స్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కొడుకు డెలివరీ సమయంలోనే తల్లి మృతి
జైసాయి డెలివరీ సమయంలోనే తల్లి అరుణ మృతి చెందింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అప్పట్లోనే మృతి చెందడంతో తండ్రి రవికుమార్ ఆ బాలుడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచాడు. యుక్త వయస్సుకు వచ్చిన కుమారుడు 20 ఏళ్లకే మృతి చెందడంతో రోధనలు మిన్నంటాయి. ఎంతో హుషారుగా అందరితో కలియ తిరిగే జైసాయి మృతి చెందడంతో పాతబస్తీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read : గణేష్ నిమజ్జనంలో అపశృతి.. నీటిలో మునిగి ఆరుగురు మృతి..
Also Read : రెండో రోజు కొనసాగుతున్న వినాయకుని నిమజ్జనం..