- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
రాష్ట్ర బడ్జెట్ లో 15 శాతం విద్యకు కేటాయించాలి : ప్రొఫెసర్ హరి గోపాల్

దిశ, ఖైరతాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యకు ప్రాధాన్యమిస్తూ, రాష్ట్ర బడ్జెట్లో 15 శాతం కేటాయింపులు చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సేవ్ ఎడ్యుకేషన్, సోషల్ డెమోక్రటిక్ ఫోరం, ఎం వెంకటరంగయ్య ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ... ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరణ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విద్యా వ్యవస్థ గణనీయంగా మార్పులు వస్తే అనుకున్నాను కానీ అందుకు విరుద్ధంగా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్, కేరళ, తమిళనాడులో ప్రభుత్వాలు ఎంత ఇబ్బందుల్లో ఉన్న విద్యకు ప్రత్యేక బడ్జెట్ ఉంటుందని, మన రాష్ట్రంలో 7 శాతం కేటాయిస్తుందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం మంది ప్రైవేటు విద్యా సంస్థలో, 38 శాతం ప్రభుత్వ విద్య సంస్థలలో, రెండు శాతం వేరే వేరు సంస్థలు విద్యా అభ్యసిస్తున్నారని, 60 శాతం విద్యాసంస్థలు చదువుతున్న వారిలో 80 శాతానికి పైగా పేద మధ్య కుటుంబాలే అన్నారు.
ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాలు, ఉచిత కరెంటు తదితర ఉచిత పథకాలు కాకుండా విద్య పై శ్రద్ధ వహిస్తే పేద విద్యార్థుల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ... కీప్యాయమై నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్యను అందించాలని, ఆర్టీఏ చట్టం ప్రకారం ఉపాధ్యాయులని నియామకం, మౌలిక వసతులు, పర్యవేక్షణ అధికారులను నియమించాలని, ప్రత్యక్ష పొందిన ఉపాధ్యాయులను అంగన్వాడీ కేంద్రానికి నియమించాలని, ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజు నియంత్రణ కమిషన్ ఏర్పాటు, మధ్యాహ్న భోజన నాణ్యత, బాలికల విద్యా అభ్యసించే వారిపై ప్రత్యేక శ్రద్ధ వాయించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ నరసింహారెడ్డి, ప్రొఫెసర్ కునాల్, ఎన్-జనార్ధన్, డి. నార్గార్ రెడ్డి, చక్రధర్, ఎం.సోమయ్య, కె. సుబ్బా రావు, రాజేష్ కుమార్, కె-మురళి మనోహర్, ఖలీదా పర్వేజ్,సినీన్ ఫాతిమా, షౌకత్ ఫాతినా తదితరులు పాల్గొన్నారు.