- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- IPL2023
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
1100 గ్రాముల గంజాయి పట్టివేత

దిశ, జూబ్లిహిల్స్ : 1100 గ్రాముల గంజాయిని పట్టుకున్న సంఘటన జూబ్లిహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అడిషనల్ ఇన్స్పెక్టర్ కె.ప్రవీణ్ కుమార్, ఎస్ఐ చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు జూబ్లిహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఫిల్మ్ ఛాంబర్ ఎదురుగా రోడ్ నంబర్ 82 ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ దగ్గర సాయంత్రం 4:30 గంటలకు అనుమానాస్పద స్థితిలో ఇద్దరు వ్యక్తులు కనిపించారు. ఒక బ్యాగ్ తీసుకుని బైక్ మీద కూర్చుని పోలీసులను గమనించి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిలో ఒకరు పారిపోగా మరొక వ్యక్తి షేక్ మొహమ్మద్ ఇబ్రహీం (23) పట్టుబడ్డాడు. విచారణలో తన స్నేహితుడు సయ్యద్ హుస్సేన్‌తో కలిసి మానిక్ జహీరాబాద్ నుండి గంజాయిని సేకరించినట్లు వెల్లడించాడు. అతని నుండి సుమారు 1100 గ్రాముల బరువున్న గంజాయి, సెల్ ఫోన్ , బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఎస్ ఐ చంద్రశేఖర్, పీసీలు సందీప్, ఈశ్వర్, శ్రీకాంత్ పాల్గొన్నారు.