త్వరలో పెరగనున్న హైదరాబాద్ మెట్రో టికెట్ చార్జీలు

by Disha Web Desk 10 |
త్వరలో పెరగనున్న హైదరాబాద్ మెట్రో టికెట్ చార్జీలు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో మెట్రో వచ్చాక ట్రాఫిక్ బాధలు తగ్గాయి. రోజులో ఎంతో మంది ఉద్యోగులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఆఫీసులకు వెళ్లే వారు వెళ్ళాసిన గమ్యస్థానాలకు తక్కువ సమయంలో చేరుకుంటున్నారు. బస్సులతో పోల్చుకుంటే చార్జీలు ఎక్కువ. హైదరాబాద్ మెట్రో నిర్మాణానికి L & T సంస్థ వారు రూ.13 వేల కోట్లు ఖర్చు పెట్టారట.బ్యాంకుల నుంచి రుణం తీసుకొని.. మెట్రో నిర్మాణ పనులు చేపట్టారు. లాక్‌డౌన్ సమయం వల్ల బాగా నష్టాలు రావడంతో.. వడ్డీ కూడా చెల్లించలేని పరిస్థితులు ఎదుర్కొంటుంది. నష్టాల్లో ఉన్న మెట్రోను ఆదుకోవాలని L & T సంస్థ వారు ప్రభుత్వాన్ని కోరింది. రూ.3వేల కోట్ల లోన్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ విషయం పై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఇస్తున్న లోన్‌తో పాటు భూముల లీజు ద్వారా రూ.5వేల కోట్లు వస్తాయని మెట్రో సంస్థ వారు అంచనా వేశారని తెలుస్తుంది.


Next Story

Most Viewed