మద్యం మత్తులో వాహనం నడిపేవాళ్లు మానవ బాంబులే..! బస్సు ప్రమాద ఘటనపై సజ్జనార్ హెచ్చరిక

by Ramesh Naini |   (  Updated:2025-10-26 11:24:35  IST  )

కర్నూలులో కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటనపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పందించారు.

మద్యం మత్తులో వాహనం నడిపేవాళ్లు మానవ బాంబులే..! బస్సు ప్రమాద ఘటనపై సజ్జనార్ హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్నూలులో ఏసీ స్లీపర్ బస్సు దగ్ధమై 19 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో అంతులేని విషాదం నింపింది. అయితే ఈ సంఘటనపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) స్పందించారు. ఒక్కరి నిర్లక్ష్యం.. 20 మందిని ప్రాణాలను బలితీసుకుందని ఆదివారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. (Drunk Drivers) మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు.. చెప్పండి అని ప్రశ్నించారు.

వాళ్ళు చేసిన ఈ తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి. మీ సరదా, జల్సా కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు అని నిలదీశారు. సమాజంలో మన చుట్టే తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు, మానవ బాంబుల పట్ల జాగ్రతగా ఉండాలని హెచ్చరించారు. వీరి కదలికలపై వెంటనే డయల్ 100 కి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని తెలిపారు. చూస్తూ చూస్తూ వాళ్ళను ఇలాగే వదిలేస్తే రోడ్డు మీదకు వచ్చి ఎంతో మందిని చంపేస్తారని, వారిని మాకెందుకులే అని వదిలేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుందని వెల్లడించారు. కాగా, కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి ప్రధాన కారణంగా భావిస్తున్న బైకర్ శివశంకర్ సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియోను ట్విట్టర్ వేదికగా సీపీ సజ్జనార్ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ట్వీట్ ఇదే..

READ MORE ....

ఏకంగా సజ్జనార్ పేరుతో సైబర్ నేరగాళ్ల మోసాలు

Next Story