వివాదంలో హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలత.. ఎన్నికల వేళ ఇదేం తీరు నెటిజన్ల ఫైర్ (వీడియో)

by Disha Web Desk 13 |
వివాదంలో హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలత.. ఎన్నికల వేళ ఇదేం తీరు నెటిజన్ల ఫైర్ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో:హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవిలత వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా నిర్వహించిన శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా ఆమె చర్యలు రెండు వర్గాల మధ్య విద్వేషం పెంచి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా గురువారం హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాహనంపై ర్యాలీగా వెళ్తున్న మాధవిలత.. ఓ మసీదు వద్ద బాణం వేసినట్లుగా సంజ్ఞ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు మాధవిలత మసీదుపై బాణం వేస్తున్నట్లు రెచ్చగొడుతన్నారని కొంత మంది మండిపడుతున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదని ఆమె చర్యల వల్ల ప్రశాంతంగా నగరంలో ప్రశాంత వాతావరణం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు ఆమె ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు చేయలేదని కేవలం కెమెరా పర్ స్పెక్షన్ లో చేసింది తప్ప రెచ్చగొట్టలేదని కామంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు మాధవిలత విద్వేశాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు. మాధవిలత తీరు హైదరాబాద్ లో బీజేపీని ఓడించి ఎంఐఎంను గెలిపించేందుకు ప్రయత్నంలా ఉందని వ్యాఖ్యానించారు. మొత్తంగా ఈ వీడియో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Next Story

Most Viewed