- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా హైదరాబాద్: కేటీఆర్
దిశ, శేరిలింగంపల్లి: అంతర్జాతీయ సంస్థలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని, గడిచిన ఏడాది కాలంలో లక్షన్నరకు పైగా ఉద్యోగాలు కల్పించినట్లు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ తెలిపారు. బుధవారం రాయదుర్గంలో బోష్ కంపెనీ స్మార్ట్ క్యాంపస్ ను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పనలో హైదరాబాద్ నగరం వెనక్కి తగ్గేది లేదని అన్నారు. నగర అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని, అందుకు అనుగుణంగానే అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. ప్రపంచంలోని టాప్ కంపెనీలన్నీ అమెరికా తరువాత తెలంగాణలోనే తన సెంకడ్ హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేస్తున్నాయని ఇది రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. ఆటోమొబైల్ రంగంలో అతి పెద్ద కంపెనీ అయిన బోష్ తెలంగాణలో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణ ఖ్యాతిని మరింత పెంచిందని ఆనందం వ్యక్తం చేశారు. స్టార్టప్ రంగంలో అద్భుతంగా ముందుకు వెళ్తున్న తెలంగాణ, టాలెంట్ జోన్ గా అవతరించిందని చెప్పారు. దేశంలో మూడవ వంతు ఉద్యోగాలు ఒక హైదరాబాద్ లోనే క్రియేట్ అయినట్లు వెల్లడించారు. ఆటో మొబైల్ రంగంలో బోష్ అతిపెద్ద కంపెనీ అని, ఆటోమోటివ్ రంగంలో బోష్ మరింత రాటుదేలుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మొబిలిటీ వ్యాలీని సృష్టించేందుకు తెలంగాణ సర్కార్ కృషి చేస్తోందని, 5 జోన్ లతో తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. క్వాల్ కామ్ లాంటి సెమీ కండెక్టర్ కంపెనీలు హైదరాబాద్ లో దూసుకువెళ్తున్నాయన్నారు. మల్టీనేషనల్ కంపెనీలు ముందు అనుకున్న దాని కంటే ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంటున్నాయని దీనికి కారణం హైదరాబాద్ లో ఉన్న యంగ్ టాలెంట్ అన్నారు. ఈ కార్యక్రమంలో బోష్ ఇండియా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.