దిశ, తెలంగాణ బ్యూరో : న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ సిద్ధమైంది. మన రాష్ట్రమే కాకుండా అంతరాష్ట్రాల వారు కూడా పట్నానికి వస్తున్నారు. కర్ణాటక, మహరాష్ట్ర తదితర రాష్ట్రాల్లో న్యూ ఇయర్ఆంక్షలు అమల్లో ఉన్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల యూత్కూడా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఇప్పటికే కొందరు రాగా, మరి కొంత మంది శుక్రవారం సాయంత్రం వరకు చేరుకోనున్నారు. హోటళ్లు, గెస్ట్‌హౌజ్‌లు, పబ్‌లలో ముందస్తు బుకింగ్‌లు పూర్తయినట్లు ఈవెంట్‌మేనేజర్లు చెబుతున్నారు.
ఇక స్టార్‌హోటళ్లలో రూమ్‌లు , న్యూ ఇయర్ఈవెంట్పార్టీ పాస్‌లు దొరకడం గగనంగా మారింది. సాధారణ రోజులతో పోల్చితే నాలుగు రెట్లు అదనపు ఛార్జీలు వసూల్చేస్తున్నా.. రూమ్‌లు, పార్టీల కోసం యువత వెంపర్లాడుతున్నారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో బుకింగ్‌ల కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈవెంట్నిర్వహుకుల కార్యాలయాలు, ఫోన్లు బిజీబిజీగా ఉన్నాయి. మరోవైపు సిటీ శివారు ప్రాంతాల్లో ఎన్నడూ లేని విధంగా సుమారు 42 పార్టీలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు ఈవెంట్ ప్రతినిధులు స్పష్టం చేశారు. వాస్తవంగా ప్రతీ ఏటా కేవలం 20 నుంచి 25 పార్టీలు మాత్రమే నిర్వహిస్తుండగా, ఈసారి రెట్టింపు అయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటోళ్ల సంఖ్య పెరగడంతో వీటిని పెంచినట్లు ఈవెంట్ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ పార్టీల పాస్‌లు, స్టే చేసేందుకు రూమ్‌లు కోసం ఏకంగా మంత్రులు, ఇతర వీఐపీలు, సెలబ్రేటీల నుంచి రిఫరెన్స్‌లు పెరిగినట్లు మాదాపూర్కుచెందిన ఓ మేనేజర్ తెలిపారు.
ఆన్లైన్లు రెండు రోజుల క్రితమే క్లోజ్..
న్యూ ఇయర్ పార్టీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆన్లైన్లు రెండు రోజుల క్రితమే క్లోజ్అయ్యాయి. హైదరాబాద్‌లో ప్రతీ ఏటా నిర్వహించే 52 ఈవెంట్సంస్థల సైట్లదీ ఇదే పరిస్థితి. దీంతో తెలిసిన వాళ్లు, ముఖ్యులతో పార్టీల పాస్‌ల కోసం ప్రయత్నిస్తున్నట్లు లక్డీకపూల్కుచెందిన ఓ ఐటీ ఉద్యోగి (32) తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారిలో కొందరికి పాస్‌లు దొరుకుతుండగా, ఉండేందుకు రూమ్‌లు లభించడం లేదు. దీంతో తెలిసిన వాళ్ల ఇళ్లల్లో , ఫ్రెండ్స్తదితరులు వద్ద ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు.
హైదరాబాద్‌కు ఒమిక్రాన్ భయం..
ఇప్పటికే ఒమిక్రాన్వేరియంట్జనాల్లో కలసిపోవడంతో పార్టీలు, ఈవెంట్లతో మరింత పెరిగే ఛాన్స్ఉన్నదని పబ్లిక్హెల్త్స్పెషలిస్టులు చెబుతున్నారు. రెండు డోసులు ఉంటేనే ఎంట్రీ అనే రూల్ ఉన్నప్పటికీ, ప్రజల్లో భయాందోళన పెరిగింది. పైగా మహారాష్ట్రలో ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నది. దీంతో అక్కడ్నుంచి వచ్చే వారి సంఖ్య పెరుగుతుండటంతో అధికారులతో పాటు జనాలూ ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఇతర రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతుండగా, హైదరాబాద్‌లో లేకపోవడం విచిత్రంగా ఉన్నది. డిసెంబరు 31 అర్ధరాత్రి కేవలం పార్టీలు, రూమ్‌ల కొరకు దాదాపు రూ.10 కోట్ల బిజినెస్ జరుగుతుందని ఈవెంట్ మేనేజర్ల సంఘం పేర్కొన్నది.