HYD: ఐదు కాలనీల్లో విషవాయువుల కలకలం

by Rajesh |
HYD: ఐదు కాలనీల్లో విషవాయువుల కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ టప్పాచబుత్రలో విషవాయువు కలకలం రేపింది. విషవాయువు కారణంగా ముక్కులు పగిలిపోయే దుర్గంధంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి నుంచి ఒక్కసారిగా భయంకరమైన వాసన మొదలైంది. విషవాయువులా, రసాయనలా, మరేదైనా దుర్గంధమా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. వాసనతో స్థానికులు ముక్కుమూసుకుని ఉండలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.

కొందరు మహిళలు, చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. టప్పాచబుత్రతో పాటు మరో ఐదు కాలనీల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. టప్పాచబుత్ర, యూసుఫ్ నగర్, కార్వాన్, నటరాజ్ నగర్, మహేష్ కాలనీలో భయంతో స్థానికులు రాత్రంతా జాగారం చేశారు. విషవాయువులు కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. స్థానికులు ఫిర్యాదుతో డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు అక్కడి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Next Story

Most Viewed