- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
HYD: రూమ్ షేరింగ్ కోసం యాడ్ ఇచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. మహిళ వేశ్య అని తేలడంతో..

దిశ, వెబ్‌డెస్క్: రూమ్ షేరింగ్ కోసం యాడ్ ఇస్తున్నారా.. అయితే బీ అలర్ట్. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఓ ఘటన మిమ్మల్ని షాక్‌కు గురిచేయడం ఖాయం. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేసే కిరణ్ అనే యువకుడు వెంగళరావు నగర్‌లో వన్ ఇయర్ క్రితం రూమ్ తీసుకున్నాడు. తనతో రూమ్ షేర్ చేసుకునేందుకు ఒకరు కావాలని ఓ యాడ్ సంస్థలో ప్రకటన ఇచ్చాడు. అయితే ఓ మహిళ ఫోన్ చేసి తాను ఉంటాను అనడంతో ఇద్దరు కలిసి కూకట్ పల్లిలో ఉంటున్నారు. ఇటీవల సదరు మహిళ తాను ఓ వేశ్యనని చెప్పడంతో కిరణ్ షాక్ కు గురయ్యాడు.
వెంటనే తన గది ఖాళీ చేయమనడంతో ఆ మహిళ క్లోజ్‌గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించింది. అంతటితో ఆగకుండా తనపై యువకుడు లైంగిక దాడి చేశాడని పోలీసులకు కంప్లైంట్ సైతం చేసింది. ఇద్దరికీ షీ టీం పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వగా మహిళ రూ.4.7లక్షలను పరిహారం కింద వసూలు చేసింది. తర్వాత సోషల్ మీడియాలో కిరణ్ ఫోటోలను వైరల్ చేసింది. దీంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులు ఫిర్యాదు చేశాడు. సదరు ఫోటోలను సోషల్ మీడియాలో నుంచి మహిళ తొలగించింది. ఈ నెల 13న బాధితుడిపై ఇద్దరు వ్యక్తులతో మహిళ దాడి చేయించింది. విసిగిపోయిన బాధితుడు బుధవారం రాత్రి స్థానిక పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ చేశాడు.