- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
HYD : నిమజ్జనం ఎఫెక్ట్.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..!

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో వినాయకుని నిమజ్జనం రెండో రోజు కొనసాగుతోంది. ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, అబిడ్స్, కోరంటి వరకు భారీగా గణనాథులు క్యూ కట్టాయి. లక్డీ కపూల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మార్గాల్లో శోభాయాత్ర కొనసాగుతోంది. నిమజ్జనం నేపథ్యంలో తెలుగు తల్లి ఫ్లై ఓవర్, లక్డీకపూల్, సికింద్రాబాద్,ట్యాంక్ బండ్, బషీర్ బాగ్ వైపు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కూకట్ పల్లి, ఎర్రగడ్డ మీదుగా వచ్చే వాహనాలు అమీర్ పేట్ వైపునకు మళ్లిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇక నగరంలో పలు చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఇక ఈ రోజు మధ్యాహ్నం వరకు గణేష్ నిమజ్జనాలు జరగనున్నాయి. శోభాయాత్ర కొనసాగిన మార్గాల్లో జీహెచ్‌ఎంసీ కార్మికులు చెత్తను తొలగిస్తున్నారు.