కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు..

by Disha Web Desk 11 |
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు..
X

దిశ, కొమురవెల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం మహా మండపంలో ఆలయ ఈఓ బాలాజీ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ ఇన్ స్సెక్టర్ల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహించారు. 29 రోజులకు గాను మొత్తం ఆదాయం రూ. కోటి 8 లక్షల 62,138 లు నగదు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. మిశ్రమ బంగారం 88 గ్రాములు, వెండి 13.500 కేజీలు, బియ్యం 2,700 కిలోలు, విదేశీ కరెన్సీ నోట్లు 30 వచ్చాయని ఆలయ ఈఓ బాలాజీ తెలిపారు. ఈ మొత్తాన్ని స్థానిక ABGVB బ్యాంక్ లో జమచేశారు.

కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గిస భిక్షపతి, ఏఈవో వైరాగ్యం అంజయ్య, ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జున్, స్థానా చార్యులు పడిగన్నగారి మల్లయ్య, ధర్మకర్తలు నర్ర రఘువీరారెడ్డి, సిద్దిలింగం, నమిరెడ్డి సౌజన్య, పచ్చిమడ్ల సిద్దిరాములు, సూపరింటెండెంట్ నీల శేఖర్, ఆలయ సిబ్బంది మిన్నలపురం నర్సింహులు, మాధవి, అంజయ్య, అర్చకులు శివ రామ కృష్ణ, భజన మండలి సభ్యులు 250 మంది లెక్కింపు లో పాల్గొన్నారు. ఎస్ఐ చంద్రమోహన్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

Next Story

Most Viewed