భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే?

by Disha Web Desk 6 |
భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్: చాలా మంది ముక్క లేకుంటే అన్నం తినడానికి సంకోచిస్తుంటారు. ప్రతి రోజు తినకపోయినా కానీ వారానికి మూడు నాలుగు సార్లు అయినా చికెన్ తెచ్చుకుని తింటుంటారు. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు రోజు రోజు భారీగా పెరిగిపోతున్నాయి. మటన్ రేటులో సగానికి పైగా చికెన్ ధరలు ఉండటంతో నగరవాసులు మాంసం తినడానికి భయపడిపోతున్నారు. గత నెలలో కిలో స్కిన్ లెస్ చికెన్ రూ. 250 ఉంటే ఇప్పుడు హైదరాబాద్‌లో కిలో చికెన్ ధర 340-360 రూపాయలకు విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ చికెన్ రూ. 300 అమ్ముతుండగా.. చోన్ లెస్ కిలో రూ. రూ.400 విక్రయిస్తున్నారు. మండుతున్న ఎండల ప్రభావం వల్ల కోళ్ల ఉత్పత్తి తగ్గింది. దీంతో ఉత్పత్తి అవుతున్న కోళ్లను లాభసాటి ధరకు అమ్ముకోవడం కోసం వ్యాపారస్తులు చికెన్ ధరలను పెంచుతున్నారు. జూన్ చివరి వరకు ఈ ధరలు అలాగే కొనసాగుతాయని సమాచారం.

Next Story