- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
హైదరాబాద్ లో భారీగా హవాలా డబ్బు స్వాధీనం
దిశ, కార్వాన్ : హైదరాబాద్ లో మంగళవారం భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. సుల్తాన్ బజార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం బొగ్గులకుంటలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో బైక్ పై వస్తున్న ఇద్దరిని పోలీసులు ఆపేందుకు యత్నించారు. వారు తప్పించుకొని పోవడంతో, కోఠి హనుమాన్ టెక్డి వద్ద పోలీసులు వారిని పట్టుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్(27), వసంత్(24)ల వద్ద అనుమానాస్పదంగా ఉన్న బ్యాగ్ ను తనిఖీ చేయగా అందులో కోటి రూపాయలు నగదు లభించింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. తమకు ఈ డబ్బుతో ఎలాంటి సంబంధం లేదని, తన ప్రతినిధి తరుణ్ ఆదేశాల మేరకు డబ్బులను తీసుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. వారు ఇచ్చిన సమాచారంతో హనుమాన్ వ్యయామశాల వద్ద ఉన్న ఓ అపార్ట్మెంట్లో తనిఖీ చేయగా అక్కడ 21లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. అక్కడ ఉన్న తరుణ్ ను విచారించగా.. ముంబై లో ఉండే బబ్లు అనే హవాలా వ్యాపారి ఆదేశాల అనుసారంగా తాము పని చేస్తున్నామని తెలిపాడు. నగరంలో ఉండే వ్యాపారుల నుండి ఈ లావాదేవీలు సాగిస్తున్నట్లు డీసీపీ బాలస్వామి వెల్లడించారు. హవాలా డబ్బు తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 1 కోటి 21 లక్షల నగదు, 2 సెల్ ఫోన్లు, రెండు కౌంటింగ్ మిషన్లు సీజ్ చేసి ఇంకమ్ టాక్స్ అధికారులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు బబ్లు ను త్వరలో అరెస్ట్ చేస్తామని డీసీపీ వివరించారు.