రాష్ట్రం ఎలా చట్టం చేస్తుంది.. BC కులగణనపై మాజీ మంత్రి గంగుల కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
రాష్ట్రం ఎలా చట్టం చేస్తుంది.. BC కులగణనపై మాజీ మంత్రి గంగుల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీ కులగణనపై అసెంబ్లీలో వాడివేడి చర్చ కొనసాగుతోంది. ఈ అంశంపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. బీసీ కులగణనపై తీర్మానం కాదు.. చట్టం చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు కులగణన చేస్తే.. బీసీ కులాలే నష్టపోతాయన్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణన చట్టం చేయాలన్నారు. కులగణన ఏ విధంగా చేస్తారో ముందే స్పష్టం చేయాలన్నారు. కేంద్రం పరిధిలోని అంశంపై రాష్ట్రం ఎలా చట్టం చేస్తుందన్నారు. రిజర్వేషన్లు 50 శాతం మించిపోతే ఏం చేస్తారని ప్రభుత్వాన్ని గంగుల ప్రశ్నించారు. చట్టసభల్లో 50 శాతం ఎమ్మెల్యేలు ఉండాలని ఆశిస్తున్నామన్నారు.

Next Story