మేడారంలో హిజ్రాలకు ఘోర అవమానం (వీడియో)

by Disha Web Desk 4 |
మేడారంలో హిజ్రాలకు ఘోర అవమానం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కుంభమేళా మేడారం జాతరలో హిజ్రాలకు ఘోర అవమానం జరిగింది. సారలమ్మను గద్దెకు తీసుకువచ్చే సమయంలో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యహరించారని, తోసేసి కొట్టారని హిజ్రాలు ఆరోపించారు. ఈ అంశంపై హిజ్రాలు మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా జాతరకు వస్తున్నామని ఏనాడు ఇలా జరగలేదన్నారు. సారలమ్మ వస్తున్నప్పుడు మేమంతా పక్కకు జరిగినా మంత్రి సీతక్క వస్తున్నారని తమను తోసేశారన్నారు. మంత్రి కావాలనే పోలీసులతో తమను కొట్టించారని హిజ్రాలు ఆరోపించారు. తాము ఆదివాసీ గిరిజనులమే అని.. వీఐపీల కోసం తాము తీసుకొస్తున్న దేవున్ని అక్కడి నుంచి తొలగించారని మండిపడ్డారు.

Next Story

Most Viewed